Sunday, 08 September 2024 07:34:11 AM

***రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం...రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను***

మిచౌoగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, అధైర్య పడద్దని రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు

Date : 08 December 2023 12:33 AM Views : 194

N7TV News Telugu - Andhra Pradesh / NTRDistrict : రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం._ పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది. పంటల రక్షణ, తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు.. మిచౌoగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, అధైర్య పడద్దని రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం, ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు గ్రామాలలో రాష్ట ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలు, ధాన్యం రాశులు పరిశీలించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. _ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడం బాధాకరమన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు. అదే చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని, నేడు జగనన్న ప్రభుత్వంలో అలాంటి సంఘటనలు ఎక్కడ జరగడం లేదన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టపోతే అదే సీజన్లో నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో పంటలను నష్టపోయిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఉదయభాను హామీ ఇచ్చారు._ ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Veenu

Admin

N7TV News Telugu

Copyright © N7TV News Telugu 2024. All right Reserved.



Developed By :